నువ్వుల చిక్కి చేదు లేకుండా అచ్చు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్స్ తోట్రై చేయండి-Nuvvula Chikki recipe
Description :
నువ్వుల చిక్కి చేదు లేకుండా అచ్చు పర్ఫెక్ట్ గా రావాలంటే ఈ టిప్స్ తోట్రై చేయండి-Nuvvula Chikki recipe-Chikki recipe
సంక్రాంతి స్పెషల్ నువ్వుల చిక్కి అండి చిక్కి చేయడం చాలా ఈజీ కేవలం రెండు పదార్థాలు ఉంటే చాలు చిక్కి రెడీ అవుతుంది.
ఇది బాగా పల్చగా అచ్చు అనేది పర్ఫెక్ట్ గా రావాలంటే పాకం ఎలా తయారు చేసుకోవాలి ఇంగ్రిడియంట్స్ కొలతలతో ఎంత ఉండాలో చూద్దాం.
నువ్వులు, ఇవి ఒక కప్పు తీసుకున్నాను నేను, మీరు మీ ఇష్టం వచ్చిన కొలత అయినా తీసుకోవచ్చు.
స్టవ్ Low ఫ్లేమ్ పెట్టుకొని, కంటిన్యూగా కలుపుతూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోండి.
పప్పు బాగా వేగితే చిక్కి టేస్ట్ ఉంటుంది. అలాగే కొంచెం ఉబ్బినట్లుగా కూడా మనకి అర్థమవుతుంది.
నువ్వులు చిటపటలాడితే ఇవి చక్కగా వేగినట్లు అనమాట.
ఇక స్టవ్ ఆపేసి వెంటనే వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి.
ఇప్పుడు తురిమిన బెల్లం అదే కొలత కప్పుతో కప్పు తీసుకోండి ఈక్వల్ అన్నమాట.
బెల్లం కరగడం కోసం ఒక పావు కప్పు మాత్రమే నీళ్లు పోయండి ఎక్కువ నీళ్లు పోస్తే పాకం రావడానికి లేట్ అవుతుంది.
Low ఫ్లేమ్ పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకోండి. ఇది తయారయ్యేలోపు పక్కన ఇంకొక ఇంపార్టెంట్ పని చేయాలండి.
ఏంటంటే బట్టర్ పేపర్ కి అలాగే చపాతీ కర్రకి Gheeఅప్లై చేసి పక్కన రెడీగా ఉంచుకోవాలి. ఎందుకంటే పాకం వచ్చేసిన తర్వాత వెంటనే స్పీడ్ చేసుకోవాలి కాబట్టి ముందుగా దీన్ని రెడీగా పెట్టుకోవాలి.
ఇక్కడ పాకం కొంచెం ముదురుతూ ఉంది కాబట్టి సెగ తగ్గించుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఉడికించుకోవాలి లేదంటే పాకం మాడిపోతుంది.
అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.
పాకం వాటర్ లో వేసి తీసిన తర్వాత బాగా గట్టిగా అయ్యి గిన్నెకి వేసి కొడితే సౌండ్ వస్తుంది.
ఈ దశలో ఒక స్పూన్ నెయ్యి వేసి కలిపి, ఇక వెంటనే నువ్వులు వేసి మొత్తం బాగా కలిపి ఈ మిశ్రమం మొత్తాన్ని వెంటనే మనం రెడీ గా పెట్టుకున్న బట్టర్ పేపర్ ఉంది కదా దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి.
మనం లేట్ చేసే కొద్దీ ఈ పాకం అనేది కడాయిలోనే ఆరిపోతుంది.
వెంటనే చపాతీ కర్రతో పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి బాగా ఎనర్జీ యూస్ చేసి వీలైనంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి.
ఎంత పల్చగా స్ప్రెడ్ చేస్తే చిక్కి అనేది అంత పల్చగా వస్తుంది. వెంటనే దీనిని ముక్కలుగా కట్ చేసుకోవడానికి మీకు కావాల్సిన షేప్ లో మార్క్ చేసుకోవాలి .
లేదంటే ఇది ఆరిపోయిన తర్వాత పీసెస్ రావనమాట. ఇది త్వరగా ఆరిపోతుంది కట్ చేసేటప్పుడు కూడా చాలా గట్టిగా ఉంటుంది. కొంచెం బలంగా వీటిని కట్ చేసుకోవాలి.
ఒక 10 మినిట్స్ అలా వదిలేసేయండి. 10 టు 15 మినిట్స్ లో చక్కగా ఆరిపోతుంది. అలాగే పీసెస్ కూడా ఎంతో పల్చగా వస్తాయి.
Date Published | 2025-01-08 14:13:43 |
Likes | 17 |
Views | 372 |
Duration | 4:43 |