Pepper Rasam In Telugu | మిరియాల చారు | Miriyala Charu Recipe in Telugu| Rain Season Special Recipes
Description :
simple pepper rasam recipe in telugu
lakshmi vantillu
tomato pepper rasam
tomato miriyala charu
healthy miriyala rasam recipe
how to make miriyala chaaru
andhra special recipes
telugu vantalu
Hai Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు మిరియాల రసం ఎలా తయారు పెట్టుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మిరియాలు – 1 tsp
వెల్లుల్లి రెబ్బలు – 15
జీల కర్ర – ½ tsp
చింత పండు – ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత తీసుకోండి
టమాటో – 1
ఆయిల్ – 4 tsp
ఎండు మిర్చి – 3
ఉప్పు
పసుపు
ఆవాలు
కరివేపాకు
కొత్తిమీర
వాటర్
తయారీ విధానం :
ముందుగా చింత పండు ని ఒక బౌల్ లో వేసి వాటర్ పోసుకొని 10 నిమషాలు పాటు నాన బెట్టుకోండి
ఇప్పుడొక మిక్సీ జార్ లో తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు , మిరియాలు , జీల కర్ర వేసి కొంచెం గ్రైండ్ చేసుకోండి
మరీ పేస్టు లా కాకుండా కొంచెం కచ్చ పచ్చగా గ్రైండ్ చేసుకోండి
తరువాత స్టవ్ పై బౌల్ పెట్టి ఆయిల్ వేసి… హీట్ అయ్యాక ఆవాలు, ఎండు మిర్చి వేసి కొంచెంసేపు వేయించండి
దీనిలో కొద్దిగా పసుపు , ఉప్పు ….. రెండు గ్లాసుల చింతపండు రసం, కట్ చేసిన టమాటో , గ్రైండ్ చేసిన మిరియాలు , కరివేపాకు , కొత్తిమీర వేసి బాగా కలుపుకొండి.
ఒకసారి ఉప్పు సరిచూసుకొని … కావలిసినంత కలుపుకొని…. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా మరిగించుకోండి
రసం ఎంత బాగా మరిగితే అంత tasty గా ఉంటుంది
చివరిలో మరి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
చూసారుగా చాల సింపుల్ రెసిపీ ఇది… మీరు కూడా ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#pepperrasam #miriyalachaaru #recipetelugu
Date Published | 2020-06-12 12:02:49Z |
Likes | 6 |
Views | 140 |
Duration | 0:03:29 |