Karnataka famous Donne Biryani Recipe in Telugu | Donne Biryani | Chicken Biryani Recipes | Telugu

Karnataka famous Donne Biryani Recipe in Telugu | Donne Biryani | Chicken Biryani Recipes | Telugu

Description :

Karnataka famous Donne Biryani Recipe in Telugu | Donne Biryani | Chicken Biryani Recipes | Telugu
Benguluru donne Biryani recipe
famous biryani recipe
how to make donne biryani
chickpet donne biryani recipe in telugu
chicken biryani making video
biryani recipes in telugu

Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు Karnataka famous donne biryani ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
బాసుమతి రైస్ 1 గ్లాసు , చికెన్ 500 గ్రాములు , బిరియాని ఆకులు 2, షాజీర ½ tsp , లవంగాలు 8, యాలకులు 3, దాల్చిన చెక్క 1 inch, కట్ చేసిన అల్లం 3 tsp , వెల్లుల్లి రెబ్బలు 8, కసూరి మేతి ,
పుదీనా – 2 కట్టు మీడియం సైజు , కొత్తిమీర – 2 కట్టలు మీడియం సైజు , ఉల్లి పాయ 1, పచ్చి మిర్చి 6, ఉప్పు , పసుపు , గరం మసాలా 1 tsp, ధనియాల పొడి 1 tsp , ఆయిల్ 2 tsp , నెయ్యి 3 tsp ,
పెరుగు 4 tsp
తయారీ విధానం
ముందుగా బాసుమతి రైస్ ని బాగా వాష్ చేసి తగినంత వాటర్ పోసుకొని ఒక గంట సేపు నాన బెట్టుకోండి
తరువాత మిక్సీ జార్ లో పుదీనా , కొత్తిమీర , పచ్చి మిర్చి , కొంచెం వాటర్ పోసి బాగా గ్రైండ్ చేసి పేస్టు లా చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై బౌల్ పెట్టి ఆయిల్ , నెయ్యి వేసి కొంచెం హీట్ అయిన తరువాత బిరియాని ఆకులు , షాజీర , కొంచెం కసూరి మేతి , దాల్చిన చెక్క , లవంగాలు , యాలకులు వేసి కొంచెం సేపు వేయించండి
దీనిలో నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ,,,, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి
ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం , క్రుష్ చేసిన వెల్లుల్లి వేసి మరో నిమషం పాటు ఫ్రై చేసుకోండి
తరువాత దీనిలో పసుపు – గరం మసాలా – ధనియాల పొడి – ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్టు – కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ – 1 tsp ఉప్పు వేసి బాగా కలిపి 10 నిమషాల పాటు ఉడికించుకోండి
ఈ విధంగా చికెన్ లోంచి వాటర్ వచ్చిన తరువాత ఒకటిన్నర గ్లాసు వాటర్ – రుచికి సరిపడా ఉప్పు – నానా బెట్టిన బాసుమతి రైస్ – పెరుగు వేసి బాగా కలుపుకొండి
బిర్యానీ కొంచెం స్పైసి గా కావాలనుకుంటే ఇంకో రెండు పచ్చి మిర్చి ని నిలువుగా కట్ చేసి వేసుకోండి
స్టవ్ ని హై ఫ్లేమ్ లో ఉంచి బౌల్ పై మూత పెట్టి పది నుంచి పదిహేను నిమషాల పాటు ఉడికించుకోండి
తరువాత స్టవ్ ఆఫ్ చేసి అలాగే అరగంట సేపు ఉంచిన తరువాత serve చేసుకోండి
కొంచెం డిఫరెంట్ బిర్యానీ తినాలనిపిస్తే ఈ విధంగా ట్రై చేసి చూడండి … చాల tasty గా ఉంటుంది
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you

#donnebiryani #recipe #telugu


Rated 5.00

Date Published 2020-09-19 08:46:41
Likes 2
Views 28
Duration 4:23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..