Instant మష్రూమ్ సూప్ | Mushroom Soup Recipe in Telugu | Mushroom Soup Restaurant Style | Cooking
Description :
Instant మష్రూమ్ సూప్ | Mushroom Soup Recipe in Telugu | Mushroom Soup Restaurant Style | Cooking
How to make mushroom soup
mushroom soup recipe
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు Simple గా instant గా Mushroom Soup ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మష్రూమ్ 6, కార్న్ ఫ్లోర్ 2 tsp
ఆయిల్ 2 tsp, వెల్లుల్లి రెబ్బలు 5, ఉల్లిపాయ 1, పచ్చి మిర్చి 1, ఉప్పు , మిరియాల పొడి , కొత్తిమీర , నిమ్మకాయ
తయారీ విధానం
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి … హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి వేసి కొంచెం సేపు వేయించండి
దీనిలో చిన్నగా కట్ చేసుకున్న పచ్చి మిర్చి , ఉల్లిపాయ , కొద్దిగా ఉప్పు , పెప్పర్ పౌడర్ వేసి దోరగా వేయించండి
తరువాత కొత్తిమీర , చిన్నగా కట్ చేసుకున్న మష్రూమ్, ఒక గ్లాసు వాటర్ కూడా పోసి బాగా కలిపి … నాలుగు నిమషాల పాటు మూత పెట్టుకోండి . స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి
ఇప్పుడు ఒక బౌల్ లో కార్న్ ఫ్లోర్ వేసి … అర గ్లాసు వాటర్ పోసుకొని … ఉండలు లేకుండా కలుపుకొండి
మష్రూమ్ బాగా ఉడికిన తరువాత …. కలిపి ఉంచుకున్న కార్న్ ఫ్లోర్ వేసి …. సూప్ చిక్క బడే వరకు కలుపుతూ ఉండండి
ఒకసారి ఉప్పు , పెప్పర్ పౌడర్ సరి చూసుకొని … తగినంత కలుపుకొండి
చివరిగా మరి కొంచెం కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
రెడీ అయిన సూప్ ని ఒక బౌల్ లోకి తీసుకొని తగినంత నిమ్మ రసం పిండుకొని … వేడి వేడి గా serve చేసుకోండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#mushroomsoup #recipe #restaurantstyle
Date Published | 2020-07-23 17:00:25 |
Likes | 2 |
Views | 25 |
Duration | 2:42 |