Egg Masala Curry In Telugu | జీడి పప్పు వేసి ఎగ్ మసాలా గ్రేవీ చేస్తే ఎలా ఉంటుంది | Simple Egg Curry

Egg Masala Curry In Telugu | జీడి పప్పు వేసి ఎగ్ మసాలా గ్రేవీ చేస్తే ఎలా ఉంటుంది | Simple Egg Curry

Description :

Egg Masala Gravy in telugu
cashew egg masala gravy recipe
egg recipes in telugu
indian home food recipes
egg masala curry recipe
lakshmi vantillu
indian food recipes in telugu

Welcome to lakshmi vantillu
ఈ రోజు egg masala gravy ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి. ఇది రైస్ తో కానీ రోటి తో కానీ తీసుకోవచ్చు …, చాలా tasty గా ఉంటుంది
ఇప్పుడు దీనికి కావలిసిన పదర్దాలేంటో చూద్దాం
కోడిగుడ్లు – 5 (ఉడకబెట్టి ఉంచుకోవాలి)
ఉల్లిపాయలు – 3
టమాటో – 3
పచ్చి మిర్చి – 5
జీడి పప్పు – 5
మిరియాలు – 5
లవంగాలు – 5
యాలకులు – 2
జింజర్ గార్లిక్ పేస్టు – 1 tsp
కారం – 1 tsp
ధనియాల పొడి – 1 tsp
దాల్చిన చెక్క
జీల కర్ర
ఉప్పు
పసుపు
కరివేపాకు
కొత్తిమీర
ఆయిల్

తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయలను కట్ చేసి మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోండి. మరీ పేస్టు లా కాకుండా కొంచెం కచ్చ పచ్చ గా ఉండేలా చూసుకోండి
అలాగే టమాటో లను కూడా కట్ చేసుకొని మిక్సీ లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ , పసుపు వేసి హీట్ అయిన తరువాత బాయిల్ చేసిన ఎగ్స్ ని ఈ విధంగా గాట్లు పెట్టుకొని వేయించండి . కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు కడాయి లో మరి కొంచెం ఆయిల్ వేసుకొని జీడి పప్పు, దాల్చిన చెక్క , మిరియాలు , లవంగాలు , యాలకలు వేసి కొంచెం సేపు వేయించండి
నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి కూడా వేసి మరి కొంచెం సేపు వేయించండి
దీనిలో గ్రైండ్ చేసిన ఆనియన్స్, 1 tsp ఉప్పు , జింజర్ గార్లిక్ పేస్టు ,కరివేపాకు , కొద్దిగా జీల కర్ర వేసి బాగా కలిపి కొంచెం సేపు దోరగా వేయించండి
ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తరువాత టమాటో గుజ్జు వేసుకొని బాగా కలిపి కొంచెం సేపు మగ్గ నివ్వండి
దీనిలో కొద్దిగా పసుపు , కారం , ధనియాల పొడి వేసి బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టుకోండి
గ్రేవీ కోసం తగినంత వాటర్ పోసుకొని కలుపుకొండి
ఒకసారి ఉప్పు సరిచూసుకొని తగినంత కలుపుకొండి
దీనిలో ఫ్రై చేసిన ఎగ్స్ వేసుకోండి
స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు కొంచెం గరం మసాలా కలుపుకోవచ్చు. ఇది ఆప్షనల్ అండి
కడాయి పై మూత పెట్టి ఒక ఐదు నిమషాల పాటు లో ఫ్లేమ్ లో ఉడి కించు కొండి
చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ కి subscribe చేసుకోవడం మర్చి పోవద్దు
thank you

#eggmasalagravy #eggmasalacurry #recipe


Rated 5.0

Date Published 2020-05-17 10:20:50Z
Likes 4
Views 57
Duration 0:05:23

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..