Double Egg Roll | Egg Roll Recipe in Telugu | ఎగ్ చపాతీ | Kolkata Egg Roll | Street Food Style
Description :
egg roll recipe
double egg roll
egg chapati recipe in telugu
how to make non veg rolls at home
wheat flour roll
chapathi roll
lakshmi vantillu
Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం Double Egg Roll ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
గోధుమ పిండి – 2 cups
ఎగ్స్
ఉప్పు
ఆయిల్
ఉల్లిపాయ
కీర దోసకాయ
నిమ్మకాయ
పెప్పర్ పౌడర్
చాట్ మసాలా
టమాటో సాస్
చిల్లీ సాస్
తయారీ విధానం :
ముందుగా గోధుమ పిండి ని ఒక బౌల్ వేసి కొంచెం ఉప్పు వేసుకోండి. దీనిలో తగినంత వాటర్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ముద్దలా చేసుకోండి. రోల్స్ ని సగం గోధుమ పిండి సగం మైదా పిండి తో కూడా చేసుకోవచ్చు. అలాగే పూర్తిగా మైదా పిండి తో కూడా చేసుకోవచ్చు . మనకి రోడ్ సైడ్ దొరికే రోల్స్ కి పూర్తిగా మైదా పిండి use చేస్తూ ఉంటారు. ఈ విధంగా రెడీ చేసుకున్న ముద్దకి కొంచెం ఆయిల్ రాసి బాగా ప్రెస్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చెయ్యడం వల్ల చపాతీ లు చాల సాఫ్ట్ గా వస్తాయండి
అరగంట తరువాత పిండిని కావలిసిన సైజు లో బాల్స్ లా తీసుకోని చపాతీ లా చేసుకోండి. రోల్స్ కోసం కాబట్టి కొంచెం పెద్ద చపాతీ లా చేసుకుంటే బావుంటుంది.
ఇప్పుడు ఒక బౌల్ లో రెండు ఎగ్స్ కొంచెం ఉప్పు వేసి బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోండి
స్టవ్ పై పెనం పెట్టుకొని హీట్ అయిన తరువాత చపాతీ వేసి …. తగినంత ఆయిల్ తో రెండు వైపులా బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి
ఇప్పుడు అదే పెనం మీద కొంచెం ఆయిల్ వేసి బీట్ చేసిన ఎగ్స్ ని వేసుకోండి . ఇంచు మించు మనం చేసుకున్న చపాతీ సైజు లోనే omelette ఉండేలా adjust చేసుకోండి
omelette కొంచెం కాలిన తరువాత రెడీ చేసుకున్న చపాతీని ఈ విధంగా ప్లేస్ చేసుకొని… రెండు వైపులా బాగా కాల్చుకోండి
ఆనియన్స్ ని కట్ చేసి ఈ విధంగా layers గా విడగొట్టుకోండి
అలాగే కీర ని లోపల గింజలు లేకుండా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి
రెడీ చేసుకున్న ఎగ్ చపాతీ మీద ఆనియన్స్ ని ,కీరా ని ఈ విధంగా పెట్టుకోండి
దీనిమీద తగినంత ఉప్పు , పెప్పర్ పౌడర్ , చాట్ masala , నిమ్మ రసం, టమాటో సాస్ , చిల్లీ సాస్ వేసి… రోల్ చేసుకొని serve చేసుకోండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం అండి
thank you
#eggroll #recipe #telugu
Date Published | 2020-05-27 08:46:35Z |
Likes | 0 |
Views | 82 |
Duration | 0:06:26 |