Chicken Manchurian Recipe In Telugu | చికెన్ మంచూరియా | Non Veg Snack Recipes | Street Food Style
Description :
How to Make Chicken Manchurian at Home
street food style chicken Manchurian recipe
indian food recipes in telugu
ఈ రోజు street food style lo chicken Manchurian ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
బోన్ లెస్ చికెన్ 250 grams – కోడిగుడ్డు 1 – అల్లం వెల్లుల్లి పేస్టు – చికెన్ మసాలా – మిరియాల పొడి – ఉప్పు –కారం – పసుపు – ఆయిల్ – కార్న్ ఫ్లోర్ – మైదా పిండి – వెల్లుల్లి రెబ్బలు – అల్లం – టమాటో సాస్ – రెడ్ చిల్లీ సాస్ – సోయా సాస్ – వినేగార్ – పచ్చి మిర్చి – ఉల్లిపాయ – కొత్తిమీర
తయారీ విధానం
ముందుగా ఒక బౌల్ లో మీడియం సైజు లో కట్ చేసుకున్న చికెన్ – ½ tsp చికెన్ మసాలా – ½ tsp అల్లం వెల్లుల్లి పేస్టు – ½ tsp కారం – ½ tsp ఉప్పు – ½ tsp మిరియాల పొడి – కోడిగుడ్డు వేసి బాగా మిక్స్ చెయ్యండి
దీనిలో 1 tsp కార్న్ ఫ్లోర్ – 1 tsp మైదా పిండి వేసి బాగా కలుపుకొండి
చివరిగా 2 tsp ఆయిల్ కూడా వేసి కలుపుకొని మూత పెట్టి – ఒక అర గంట సేపు పక్కన పెట్టుకోండి
చికెన్ మారినేట్ అయిన తరువాత స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి … హీట్ అయిన తరువాత చికెన్ ని ఈ విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి
గ్రేవీ కోసం ఇప్పుడు స్టవ్ పై మరొక కడాయి పెట్టి 2 tsp ఆయిల్ వేసి – చిన్నగా కట్ చేసిన 5 వెల్లుల్లి రెబ్బలు – చిన్నగా కట్ చేసిన ½ inch అల్లం వేసి ఒక నిమషం పాటు ఫ్రై చేసుకోండి
తరువాత చిన్నగా కట్ చేసుకున్న 2 పచ్చి మిర్చి – 1 ఉల్లిపాయ వేసి మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోండి
ఇప్పుడు దీనిలో ఒక గ్లాసు వాటర్ – ½ tsp కారం – ½ tsp ఉప్పు – చిటికెడు పసుపు – ½ tsp చికెన్ మసాలా – ½ tsp అల్లం వెల్లుల్లి పేస్టు వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి కొంచెం సేపు మరిగించండి
ఇప్పుడు దీనిలో 3 tsp టమాటో సాస్ – 1 tsp రెడ్ చిల్లీ సాస్ – 1 tsp సోయా సాస్ – 1 tsp వెనిగర్ వేసి కలుపుకొండి
తరువాత ½ tsp కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ మిక్స్ చేసి గ్రేవీ లో కలపండి
గ్రేవీ దగ్గరగా వచ్చిన తరువాత ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ వేసి బాగా మిక్స్ చేసుకోండి
స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకోవాలి
చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
tasty చికెన్ మంచురియన్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#chickenmanchurian #recipe #telugu
Date Published | 2021-04-24 10:24:41 |
Likes | 1 |
Views | 26 |
Duration | 5:9 |