Baby Corn Manchurian Recipe In Telugu | Lakshmi Vantillu | Veg Snack Recipes | Street Food Style
Description :
Baby Corn Manchurian Recipe In Telugu | Lakshmi Vantillu | Veg Snack Recipes | Street Food Style
ఈ రోజు tasty గా street food style lo Baby Corn Manchurian ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం
Ingredients:
బేబీ కార్న్ 200 గ్రాములు – మైదా పిండి 2 tsp – కార్న్ ఫ్లోర్ 4 tsp – ఆయిల్ – అల్లం ½ inch – వెల్లుల్లి రెబ్బలు 10 – పచ్చి మిర్చి 1 – ఉల్లిపాయ 1 – ఉప్పు – పసుపు – కారం ½ tsp – గరం మసాలా ½ tsp – మిరియాల పొడి ½ tsp – వెనిగర్ 1 tsp – సోయా సాస్ 1 tsp – రెడ్ చిల్లీ సాస్ 1 tsp – టమాటో సాస్ 2 tsp – కరివేపాకు 2 రెబ్బలు
తయారీ విధానం
ముందుగా బేబీ కార్న్ ని ఈ విధంగా … ఆరు ముక్కలుగా కట్ చేసుకోండి
ఇప్పుడొక బౌల్ లో కట్ చేసిన బేబీ కార్న్ – మైదా పిండి – కార్న్ ఫ్లోర్ – ½ tsp ఉప్పు – కొంచెం వాటర్ వేసి కార్న్ ఫ్లోర్ – మైదా పిండి బేబీ కార్న్ పీసెస్ కి బాగా పట్టేలా కలిపి పక్కన పెట్టుకోండి
స్టవ్ పై కడాయి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత కలిపి ఉంచుకున్న బేబీ కార్న్ ని
ఆయిల్ లో వేసి రంగు మారేవరకు ఫ్రై చేసుకోండి
తరువాత స్టవ్ పై మరొక కడాయి పెట్టి 2 tsp ఆయిల్ వేసి హీట్ అయ్యాక కరివేపాకు – చిన్నగా కట్ చేసిన అల్లం – వెల్లుల్లి వేసి రెండు నిమషాల పాటు ఫ్రై చేసుకోండి
దీనిలో చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి – ఉల్లిపాయ వేసి మరి కొంచెం సేపు వేయించండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత అర గ్లాసు వాటర్ – చిటికెడు పసుపు – కారం – ½ tsp ఉప్పు – గరం మసాలా – మిరియాల పొడి వేసి ….. స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి వాటర్ దగ్గరగా వచ్చే వరకు మరిగించండి
ఇప్పుడు దీనిలో వెనిగర్ – సోయా సాస్ – రెడ్ చిల్లీ సాస్ – టమాటో సాస్ వేసి బాగా కలుపుకొండి
చివరిగా ఫ్రై చేసి పెట్టుకున్న బేబీ కార్న్ వేసి స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి గ్రేవీ ముక్కలకి బాగా పట్టేలా కలిపి … స్టవ్ ఆఫ్ చేసుకోండి
చూసారుగా చాల సింపుల్ ప్రాసెస్ ఇది ,,, ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం thank you
#babycornmanchurian #recipe #telugu
Date Published | 2021-05-27 13:57:05 |
Likes | 0 |
Views | 79 |
Duration | 4:49 |