Aloo Mutton | మటన్ బంగాళా దుంప కూర | Mutton Aloo Curry Recipe | Potato Mutton Curry | Telugu
Description :
aloo mutton gravy recipe in telugu
mutton curry recipe
non veg recipes in telugu
mutton recipes
aloo recipes
aloo mutton curry
lakshmi vantillu
Welcome to lakshmi vantillu
ఈ రోజు aloo mutton curry ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మటన్ – 300 grams
బంగాళా దుంపలు – 2
ఉల్లిపాయలు – 3
పచ్చి మిర్చి – 3
యాలకులు -2
గసగసాలు – ½ tsp
లవంగాలు – 4
దాల్చిన చెక్క – 1 inch
జీల కర్ర – ½ tsp
ధనియాల పొడి – ½ tsp
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 tsp
పసుపు
ఉప్పు
కారం
ఆయిల్
కొత్తి మీర
తయారీ విధానం :
ముందుగా మిక్సీ జార్ లో యాలకలు , గసగసాలు , లవంగాలు , దాల్చిన చెక్క , జీల కర్ర , ధనియాల పొడి వేసి కొంచెం సేపు గ్రైండ్ చేసుకోండి. తరువాత దీనిలో కొద్దిగా వాటర్ , జింజర్ గార్లిక్ పేస్టు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. కర్రీ కి కావలిసిన మసాలా పేస్టు రెడీ అయిపోయిందండి
ఇప్పుడు కుక్కర్ లో మటన్ , తగినంత నీరు , కొద్దిగా ఉప్పు , పసుపు వేసి … 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఈ విధంగా ఒక 70 పెర్సెంట్ వరకు మటన్ ఉడికితే సరిపోతుంది. అలాగే బాయిల్ చేసిన వాటర్ ని పక్కన పెట్టుకోండి తరువాత కర్రీ లో ఇదే వాటర్ ని మనం use చేసుకోవచ్చు
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసి … హీట్ అయిన తరువాత పచ్చి మిర్చి , ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం సేపు వేయించండి . దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసి బాగా కలిపి 3 నిమషాల పాటు మూత పెట్టుకోండి. ఈ విధంగా దోరగా వేగిన తరువాత దీనిలో బాయిల్ చేసిన మటన్ వేసి రెండు నిమషాల పాటు మూత పెట్టుకోండి. ఇప్పుడు దీనిలో స్కిన్ తీసి , పెద్దగా కట్ చేసుకున్న బంగాళా దుంపలు వేసుకోండి. ఇలా పెద్ద ముక్కలు ఉంటేనే మనకి తినడానికి బావుంటుందండి.
దీనిలో ముందుగా రెడీ చేసుకున్న మసాలా పేస్టు వేసి మటన్ కి , ఆలూ కి బాగా పట్టేలా కలుపుకొండి
తగినంత కారం కూడా కలిపి కొంచెం సేపు మూత పెట్టుకోండి
తరువాత దీనిలో మటన్ ని బాయిల్ చేసిన వాటర్ వేసుకొని మరికొంచెం సేపు మూత పెట్టుకోండి
ఒకసారి ఉప్పు సరి చూసుకొని అవసరమైతే కొంచెం కలుపుకొండి
కూర దగ్గరగా అయ్యే వరకు ఉడికించు కొని …. చివరిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
స్పైసి అండ్ tasty ఆలూ మటన్ కర్రీ రెడీ అయిపోయిందండి … ఇది రైస్ లోకి అండ్ రోటి లోకి కూడా చాల బావుంటుంది
మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#aloomutton #muttonaloo #recipe
Date Published | 2020-06-01 08:51:40Z |
Likes | 1 |
Views | 49 |
Duration | 0:05:24 |