Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes
Description :
Aloo Keema Recipe in Telugu | కైమా బంగాళా దుంప కూర | Mutton Keema | Potato Keema | Non Veg Recipes
Keema Potato Recipe
non veg recipes in telugu
lakshmi vantillu
indian home food recipes
mutton keema with potato
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు aloo keema ఎలా ప్రిపేర్ చెయ్యాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మటన్ కైమా 200 గ్రాములు – బంగాళా దుంప 1 – టమాటో 1 – పెరుగు 2 tsp – అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp – ఉల్లిపాయ 1 – ఎండు మిర్చి 5 – పచ్చి మిర్చి 1 – ఉప్పు – పసుపు – గరం మసాలా ½ tsp – ధనియాల పొడి ½ tsp – జీల కర్ర పొడి ½ tsp – ఆయిల్ 3 tsp – అనాస పువ్వు 1 – దాల్చిన చెక్క 1 inch – మరాటి మొగ్గ 1 – కొత్తిమీర
తయారీ విధానం
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత ఎండు మిర్చి వేసి రంగుమారే వరకు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయి లో అనాస పువ్వు – దాల్చిన చెక్క – మరాటి మొగ్గ వేసి కొంచెం సేపు వేగిన తరువాత కట్ చేసిన ఉల్లిపాయ – 1 tsp ఉప్పు – కొద్దిగా పసుపు వేసి దోరగా వేయించండి .
ఉల్లిపాయలు వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు కలపండి
తరువాత కడిగి శుభ్రం చేసుకున్న కైమా వేసి ఐదు నిమషాల పాటు ఫ్రై చేసుకోండి
దీనిలో గరం మసాలా – ధనియాల పొడి – జీల కర్ర పొడి – చిన్న చిన్న ముక్కలుగా చేసిన ఫ్రై చేసిన ఎండు మిర్చి – కట్ చేసిన టమాటో – పెరుగు – తగినంత వాటర్ వేసి కలుపుకొని పదిహేను నిమషాల పాటు ఉడికించుకోండి
కైమా ఉడికిన తరువాత కట్ చేసిన ఆలూ – మరి కొంచెం వాటర్ – చిన్నగా కట్ చేసిన పచ్చి మిర్చి వేసి మరో పది నిమషాలు మూత పెట్టి ఉంచండి
ఒకసారి ఉప్పు సరి చూసుకొని తగినంత కలుపుకొండి
కూర దగ్గరగా వచ్చిన తరువాత కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఈ కర్రీ ని మనం చపాతీ – రోటి – నాన్ తో పాటు రైస్ కూడా కలిపి తీసుకోవచ్చు. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి – మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
#alookeema #recipe #telugu
Date Published | 2021-01-04 08:06:22 |
Likes | 0 |
Views | 23 |
Duration | 4: |