సింపుల్ గా తోటకూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి | THOTAKURA PULUSU | Recipe | Telugu

సింపుల్ గా తోటకూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి | THOTAKURA PULUSU | Recipe | Telugu

Description :

సింపుల్ గా తోటకూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూడండి | THOTAKURA PULUSU | Recipe | Telugu
totakura pulusu
thotakura curry recipe in telugu
andhra thotakura pulusu
how to make thotakura curry
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు తోటకూర పులుసు ఎలా prepare చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
తోటకూర 3 కట్టలు – ఉల్లిపాయ 1, టమాటో 1, పచ్చి మిర్చి 2, చింత పండు ఒక నిమ్మకాయ సైజు ,
వెల్లుల్లి రెబ్బలు 5, ఎండు మిర్చి 2 – జీల కర్ర – ఆవాలు – మినపప్పు – మెంతులు – ఉప్పు – పసుపు – ఆయిల్ 3 tsp – కరివేపాకు – ధనియాల పొడి 1 tsp – కారం 1 tsp
తయారీ విధానం
ముందుగా చింత పండు ని ఒకటిన్నర గ్లాసు వాటర్ లో వేసి … పది నిమషాల పాటు నాన బెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి …. హీట్ అయిన తరువాత క్రుష్ చేసిన వెల్లుల్లి – కొద్దిగా ఆవాలు – మినపప్పు – జీల కర్ర – మెంతులు – ఎండు మిర్చి – కరివేపాకు వేసి వేయించండి
తాలింపులు కొంచెం వేగిన తరువాత పచ్చి మిర్చి – ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోండి
తరువాత దీనిలో చిన్నగా కట్ చేసిన టమాటో – 1 tsp ఉప్పు – కొద్దిగా పసుపు – కారం వేసి మగ్గ నివ్వండి
టమాటో కొచెం మగ్గిన తరువాత చిన్నగా కట్ చేసిన తోటకూర వేసి కలుపుకొని – ఐదు నిమషాలపాటు మూత పెట్టుకోండి
తోటకూర పచ్చి వాసన పోయే వరకు మగ్గిన తరువాత చింత పండు రసం – ధనియాల పొడి వేసి మూత పెట్టి పది నిమషాల పాటు ఉడికించుకోండి
పులుసు బాగా దగ్గరగా వచ్చిన తరువాత ఉప్పు – కారం సరి చూసుకొని తగినంత కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
సింపుల్ గా తోటకూర పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారుగా …. మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you

#thotakurapulusu #recipe #telugu


Rated 5.00

Date Published 2020-10-15 17:17:31
Likes 1
Views 46
Duration 3:21

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..