సంవత్సరం నిల్వ ఉండే టమాటో పచ్చడి | Tomato Pickle Recipe | Pickles Recipes in Telugu #LakshmiVantillu
Description :
నిల్వ టమాటో పచ్చడి ఎలా పెట్టుకొవాలో ఈ వీడియో లో చూడండి
Tomato Pickle Recipe step by step
andhra special tomato pickle
easy tomato pickle recipe
ఈ రోజు మనం టమాటో నిల్వ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
టమాటో – 1 కేజీ, కల్లు ఉప్పు – 150 గ్రాములు , చింత పండు – 150 గ్రాములు , కారం – 150 గ్రాములు ,
ఆయిల్ – 200 grams (pappu noone/ verusenaga noone),
వెల్లుల్లి – 2,
ఎండు మిర్చి – 2,
పసుపు – 1 tsp
ఆవాలు – 3 tsp, మెంతులు – 2 tsp,
మినపప్పు – 2 tsp
తయారీ విధానం:
ముందుగా టమాటో లని బాగా కడిగి, తడి లేకుండా తుడిచి కొంచెం సేపు ఆరబెట్టండి
ఏ మాత్రం తడి తగిలినా పచ్చడి పాడయ్యే అవకాశం ఉంది కాబట్టి టమోటా లని కొంచెం సేపు ఎండలో పెట్టుకోండి
టమోటా లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దీనిలో ఉప్పు మరియు పసుపు కలిపి రెండు రోజుల పాటు వూరబెట్టుకోండి
ఈ విధంగా వూరిన తరువాత టమాటో లని రసం లేకుండా పిండుకొని పక్కన పెట్టండి
వీటిని రెండు రోజుల పాటు ఎండలో పెట్టండి
అలాగే టమాటో రసాన్ని కూడా ఒక రోజు పాటు ఎండలో పెట్టండి
రెండు రోజుల తరువాత టమాటో రసంలో ఎండిన టమాటో ముక్కలు , చింత పండు వేసి బాగా కలపండి
చింత పండు లో పిక్కలు లేకుండా చూసుకోండి
ఈ విధంగా కలుపుకొని మరో రెండు రోజులు వూరనివ్వండి
బాగా వూరిన తరువాత దీనిలో కారం కలిపి మిక్సీ లో గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి
రెండు టీ స్పూన్స్ మెంతులని కొంచెం వేయించి దీనిలో రెండు టీ స్పూన్ల ఆవాలు కలిపి పొడిగా చేసుకోండి
దీనిని గ్రైండ్ చేసిన మిశ్రమంలో కలపండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ హీట్ చేసుకోండి
దీనిలో 1 tsp avalu, మినపప్పు , ఎండు మిర్చి , తొక్క తీసిన వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం సేపు వేయించండి
స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ చల్లారనివ్వండి
చల్లారిన ఆయిల్ ని పచ్చడి లో కలపండి
జనరల్ గా పచ్చళ్లలో ఆయిల్ ఎక్కువ పడుతుంది … ఒక వేళ ఆయిల్ సరిపోకపోతే తరువాత అయినా ఆయిల్ ని హీట్ చేసుకొని దీనిలో కలుపుకోవచ్చు
ఈ విధంగా తయారియన టమాటో పచ్చడి సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది
#tomatopickle #recipe #telugu
Date Published | 2020-04-12 05:20:19Z |
Likes | 45 |
Views | 5091 |
Duration | 0:07:05 |