శెనగ పప్పు వడలు | ఆంధ్రా బ్రేక్ ఫాస్ట్ | Vada Recipe in Telugu | Bengal Gram Vada | Snacks | Telugu
Description :
vada recipe in telugu
traditional south indian break fast and snack item
its also used for curry
vadala pulusu
bengal gram vada recipe
how to make vada in telugu
food recipes in telugu
ఈ రోజు మనం సెనగ పప్పు వడలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం అండి… దీన్ని మనం బ్రేక్ఫాస్ట్ గాను లేదా ఈవెనింగ్ snakcs గా కూడా తీసుకోవచ్చు. అలాగే వీటితో పులుసు కూడా చేసుకోవచ్చు చాలా tasty గా కూడా ఉంటుంది . ఇప్పుడు దీనికి కావలిసిన పదార్ధాలు ఏంటో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
పచ్చి సెనగ పప్పు – ¼ kg
పచ్చి మిర్చి – 6
అల్లం
ఉప్పు – రుచికి సరిపడా
జీల కర్ర
ఉల్లిపాయలు – 2
కొత్తిమీర
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా పచ్చి సెనగపప్పు ని 5 – 6 గంటల పాటు నాన బెట్టుకొండి . మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా చేసుకోవాలనుకుంటే ముందు రోజు రాత్రి నాన బెట్టుకోవాలి .
ఈ విధంగా నానిన పప్పు ని బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి
ఒక చిన్న జార్ లో పచ్చి మిర్చి – కొంచెం అల్లం వేసి గ్రైండ్ చేసుకోండి.
ఇప్పుడు వేరొక జార్ లో పప్పు వేసి కొంచెం సేపు గ్రైండ్ చేసి ….. ఉప్పు , కొద్దిగా నీరు కలిపి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి .
మరీ పేస్టు లా కాకుండా కొంచెం గరుకుగా ఉండేలా చూసుకొని గ్రైండ్ చేసుకోండి
దీనిలో ముందుగా రెడీ చేసుకున్న పచ్చి మిర్చి – అల్లం పేస్టు వేసి ఒక 10 సెకన్లు గ్రైండ్ చేసుకోండి
దీనిలో కొంచెం జీల కర్ర , ఉల్లిపాయ ముక్కలు , కొత్తిమీర వేసి బాగా కలుపుకొండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ చేసుకోండి
రెడీ చేసుకున్న పిండిని చిన్న ముద్దగా తీసుకొని వేళ్ళ మీద spread చేసుకోని ఆయిల్ లో వేసి డీప్ ఫ్రై చేసుకోండి
ఈ వడలతో మనం పులుసు కూడా పెట్టుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలో మరొక వీడియో లో explain చేస్తానండి
#senagapappu #vada #recipe
Date Published | 2020-05-07 03:56:11Z |
Likes | 1 |
Views | 46 |
Duration | 0:04:12 |
Superb tq akka