మష్రూమ్ మసాలా గ్రేవీ | Mushroom Masala Gravy Recipe | Telugu | Lakshmi Vantillu | Mushroom Curry
Description :
Mushroom Masala Gravy Recipe | Telugu | Lakshmi Vantillu | Mushroom Curry Recipe in Telugu
masala mushroom curry recipe
veg recipes
side dish for naan , chapati, pulka, rice
masala mushroom gravy curry telugu
home food recipes telugu
Hai Friends… Welcome to lakshmi vantillu
ఈ రోజు Mushroom Masala Gravy ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
Mushroom 250 grams, ఉల్లిపాయలు 2, పచ్చి మిర్చి 4, టమాటో 1
దాల్చిన చెక్క 2 inch, లవంగాలు 4, యాలకులు 2 , జీడి పప్పు 6
ధనియాల పొడి ½ tsp, అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp, గరం మసాలా 1 tsp, ఆయిల్ 6 tsp
ఉప్పు , పసుపు , కారం కొత్తిమీర, కసూరి మేతి
తయారీ విధానం :
ముందుగా ఉల్లిపాయలను కట్ చేసి మిక్సీ లో వేసి గ్రైండ్ చేసుకోండి …, అలాగే టమాటో ని కూడా గ్రైండ్ చేసి పేస్టు లా చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ కడాయి పెట్టి ఆయిల్ వేసి … హీట్ అయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు , యాలకులు వేసి కొంచెం సేపు వేయించండి
దీనిలో నిలువుగా కట్ చేసిన పచ్చి మిర్చి , ఆనియన్ పేస్టు వేసి … గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి
అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చి వాసన పోయే వరకు కలుపుకొండి
తరువాత దీనిలో టమాటో పేస్టు , కొద్ద్దిగా పసుపు , తగినంత కారం , ధనియాల పొడి , ఉప్పు వేసి బాగా కలిపి ,,,, కట్ చేసిన మష్రూమ్ కూడా వేసుకోండి
మష్రూమ్ ఉడికిన తరువాత చిన్నగా అయిపోతుంది కాబట్టి… పెద్ద ముక్కలు కట్ చేసుకుంటే బావుంటుంది
తగినంత వాటర్ పోసుకొని 10 నిమషాల పాటు మూత పెట్టుకోండి
స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి ఉడికించుకోవాలి
ఇప్పుడు దీనిలో… జీడి పప్పు ని పొడిగా చేసి వేసుకోండి
స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గ్రేవీ దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోండి
గ్రేవీ దగ్గరగా వచ్చిన తరువాత గరం మసాలా , కసూరి మేతి వేసి కొంచెం సేపు కలుపుకొండి
ఒకసారి ఉప్పు సరిచూసుకొని తగినంత కలుపుకొండి
చివిరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
నాన్, పుల్క , చపాతీ , రైస్ దేనితోనైన ఈ గ్రేవీ మనం తీసుకోవచ్చు
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం … thank you
#masalamushroomgravy #mushroocurry #recipe
Date Published | 2020-07-09 11:12:27 |
Likes | 1 |
Views | 17 |
Duration | 4:14 |