మటన్ – ములక్కాయ కర్రీ | Drumstick Mutton Curry | Recipe | How to Make Mutton Curry in Telugu
Description :
drumstick with mutton curry recipe in telugu
mulakkada mutton koora in telugu
quick mutton curry in telugu
munagakada mutton
mulakkaya mutton gravy
mutton gravy in telugu
Hai Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు ములక్కాయ మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
మటన్ – 300 grams
ములక్కాడలు – 2
ఉల్లిపాయలు – 3
పచ్చి మిర్చి – 3
యాలకులు – 2
గసగసాలు – ½ tsp
లవంగాలు – 4
దాల్చిన చెక్క – 1 inch
జీల కర్ర – ½ tsp
ధనియాల పొడి – ½ tsp
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 tsp
కారం – 1 ½ tsp
ఆయిల్ – 10 tsp
పసుపు
ఉప్పు
కొత్తిమీర
తయారీ విధానం :
ముందుగా మిక్సీ జార్ లో యాలకులు , గసగసాలు , లవంగాలు , దాల్చిన చెక్క , జీల కర్ర , ధనియాల పొడి వేసి కొంచెం సేపు గ్రైండ్ చేసుకోండి
తరువాత దీనిలో వాటర్ , జింజర్ గార్లిక్ పేస్టు కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోండి
కర్రీ కి కావలిసిన మసాలా రెడీ అయిపోయిందండి
ఇప్పుడు కుక్కర్ లో కడిగి శుభ్రం చేసుకున్న మటన్ , కొద్దిగా ఉప్పు , తగినంత నీరు వేసి … 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి
ఈ విధంగా ఒక 80 % వరకు మటన్ ఉడికితే సరిపోతుంది … అలాగే బాయిల్ చేసిన వాటర్ ని పక్కన పెట్టుకోండి … తరువాత కర్రీ లో ఇదే వాటర్ ని మనం use చేసుకోవచ్చు
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి… హీట్ అయ్యాక పచ్చి మిర్చి , ఉల్లిపాయలు … 1 tsp ఉప్పు వేసి బాగా కలిపి… కొంచెం సేపు మూత పెట్టి మగ్గ నివ్వండి
ఉల్లిపాయలు దోరగా వేగిన తరువాత దీనిలో మటన్ , కొంచెం పసుపు వేసి బాగా కలిపి 5 నిమషాల పాటు మూత పెట్టుకోండి
దీనిలో కట్ చేసిన ములక్కాయలు , మసాలా పేస్టు , కారం వేసి బాగా కలుపుకొండి
బాయిల్ చేసిన వాటర్ కూడా వేసి… బాగా కలిపి… ఒక 15 నిమషాల పాటు మూత పెట్టుకోండి
స్టవ్ ని సిమ్ లో పెట్టి ఉడికించుకోవాలి
ఒకసారి ఉప్పు – కారం సరిచూసుకొని .. అవసరమైతే కలుపుకొండి
ఇప్పుడు స్టవ్ ని హై ఫ్లేమ్ లో పెట్టి కూర దగ్గరగా వచ్చే వరకు ఉడికించుకోండి
చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని …. స్టవ్ ఆఫ్ చేసుకోండి
చూసారుగా ములక్కాయ – మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో … మరొక వీడియో తో మళ్ళీ కలుద్దాం
thank you
#muttoncurry #recipe #telugu
Date Published | 2020-06-16 12:27:14Z |
Likes | 2 |
Views | 44 |
Duration | 0:04:44 |
yummy..yummy..looking super