బెండకాయ చీరి మధ్యలో మసాలా పెట్టి ఫ్రై చెయ్యండి టేస్ట్ అదిరిపోతుంది | Stuffed Bendi Fry Recipe|Telugu
Description :
Stuffed Lady Finger Masala Fry Recipe in Telugu
Ladies Finger Fry with Masala Stuffed
Very and Delicious Masala Recipes in Telugu
Bendakaya Masala Fry
Lakshmi Vantillu
Indian Food Recipes in Telugu
Okra Fry with Stuffed Masala
Stuffed Okra Fry Recipe
Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం Stuffed Bendakaya Fry ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
కావలిసిన పధార్ధాలు
బెండకాయలు – ¼ kg
జీల కర్ర – 1 tsp
సోంపు – 1 tsp
వేరుసెనగ గుళ్ళు – 4 tsp
సెనగ పిండి – 2 tsp
ధనియాల పొడి – 1 tsp
ఆమ్ చూర్ పౌడర్ – 1 tsp
చాట్ మసాలా – 1 tsp
రెడ్ చిల్లీ ఫ్లేక్స్ – 1 tsp
గరం మసాలా – 1 tsp
పసుపు
కారం – 1 tsp
ఉప్పు – 1 tsp
నిమ్మ కాయ – అర చెక్క
ఆయిల్ – తగినంత
ఇంగువ
తయారీ విధానం :
ముందుగా జీలకర్ర , సోంపు ని ఒక నిమషం పాటు డ్రై ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి
తరువాత వేరుసెనగ గుళ్ళను కూడా వేయించి చల్లారిన తరువాత పొట్టు తీసి పెట్టుకోండి
సెనగ పిండి ని కూడా ఒక నిమషం పాటు వేయించుకోండి
ఇప్పుడు జీల కర్ర , సోంపు , వేరుసెనగ గుళ్ళను మిక్సీ లో వేసి పొడిగా చేసుకోండి
రెడీ చేసుకున్న పొడిని ఒక బౌల్ లో వేసుకోండి
దీనిలో వేయించిన సెనగ పిండి , ధనియాల పొడి , అమ్ చూర్ , చాట్ మసాలా , చిల్లీ ఫ్లేక్స్ , గరం మసాలా, కొద్దిగా పసుపు , కారం , ఉప్పు , నిమ్మకాయ పిండుకొని బాగా కలపాలి .
చివరిగా రెండు tsp ఆయిల్ వేసి బాగా కలిపి మసాలా రెడీ చేసుకోవాలి
తరువాత బెండకాయలను బాగా వాష్ చేసి తడి లేకుండా తుడుచుకోండి
బెండకాయలను కట్ చేసి మధ్యలో ఈ విధంగా చీరుకోవాలి
బెండకాయలు మరీ పొడవు ఉండకూడదు … ఒకవేళ అలా ఉంటె రెండు ముక్కలుగా కట్ చేసుకోండి
ఈ విధంగా చీరుకున్న బెండకాయల మధ్యలో రెడీ చేసిన మసాలా ను కూరుకోవాలి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కొంచెం ఆయిల్ , flavor కోసం ఇంగువ వేసుకోండి
స్టఫ్ చేసిన బెండకాయలను దీనిలో వేసి మూత పెట్టి 5 నిమషాల పాటు మగ్గ నివ్వండి
స్టవ్ ని medium ఫ్లేమ్ పెట్టుకోవాలి
ఇప్పుడు ఫ్రై అయిన బెండకాయలను టర్న్ చేసుకొని మరొక 5 నిమషాలు మూత పెట్టుకోండి
మధ్య మధ్య లో చెక్ చేసుకుంటూ ఉండండి
రెండు వైపులా ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని serve చేసుకోండి
#stuffedokrafry #bendimasalafry #recipe
Date Published | 2020-04-29 06:11:11Z |
Likes | 0 |
Views | 88 |
Duration | 0:06:35 |