జీడి పప్పు చికెన్ గ్రేవీ | Cashew Chicken Gravy | Cashew Chicken Recipe in Telugu | Kaju Chicken
Description :
cashew chicken curry
cashew chicken gravy recipe
telugu
non veg recipes in telugu
side dish curries for roti, chapaati , naan
best chicken curry recipes in telugu
jeedi pappu chicken curry
Welcome to lakshmi vantillu
ఈ రోజు cashew chicken gravy ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
చికెన్ – 500 గ్రాములు
ఉల్లిపాయలు – 2
పచ్చి మిర్చి – 3
జీడి పప్పు – 15
టమాటో – 2
పసుపు
ఉప్పు – రుచికి సరిపడా
కారం – రుచికి సరిపడా
గరం మసాలా – 1 tsp
అల్లం వెల్లుల్లి పేస్టు – 1 tsp
చికెన్ మసాలా – ½ tsp
ఆయిల్ – 8 tsp
కొత్తిమీర
తయారీ విధానం :
ముందుగా జీడిపప్పు ని మిక్సీ జార్ లో వేసి పొడిగా చేసుకోండి.
తరువాత దీనిలో కట్ చేసిన టమాటో వేసి మరొకసారి గ్రైండ్ చేసి పేస్టు లా చేసుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి … హీట్ అయిన తరువాత పచ్చి మిర్చి , ఉల్లిపాయ వేసి కొంచెం సేపు వేయించండి
దీనిలో 1 tsp ఉప్పు కూడా వేసి దోరగా వేయించుకోండి
ఇప్పుడు దీనిలో కడిగి శుభ్రం చేసుకున్న చికెన్ , కొద్దిగా పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి
స్టవ్ ని లో ఫ్లేమ్ పెట్టి … 10 నుంచి 15 నిమషాల పాటు మగ్గ నివ్వండి
ముక్కలు బాగా ఉడికిన తరువాత జింజర్ గార్లిక్ పేస్టు , 1 tsp కారం వేసి బాగా కలిపి మరో రెండు నిమషాలు మగ్గ నివ్వండి
రెడీ చేసి పెట్టుకున్న జీడిపప్పు – టమాటో పేస్టు వేసి … తగినంత వాటర్ కూడా పోసుకొని మరికొంచెం సేపు మూత పెట్టుకోండి
ఉప్పు – కారం సరిచూసుకొని… తగినంత కలుపుకొండి
గ్రేవీ కొంచెం దగ్గరగా వచ్చిన తరువాత గరం మసాలా , చికెన్ మసాలా వేసి కలుపుకోండి
చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
Cashew chicken gravy రెడీ అయిపోయిందండి …, ఈ గ్రేవీ ని చపాతి , రోటి , నాన్…. అలాగే రైస్ తో కూడా తీసుకోవచ్చు
మీరు ట్రై చేసి నాకు ఫీడ్ బ్యాక్ ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#cashewchickengravy #kajuchicken #recipe
Date Published | 2020-06-04 12:12:42Z |
Likes | 2 |
Views | 73 |
Duration | 0:04:40 |