అదిరిపోయే వడల పులుసు | Andhra Pulusu | Vadala Pulusu | Soup Recipes in Telugu | Lakshmi Vantillu
Description :
పచ్చి శెనగ పప్పు వడలు తయారీ విధానం వీడియో లింక్
vadala pulusu recipe in telugu
andhra special pulusu curries in telugu
pulusu making video
how to make vadala pulusu
pachhi senaga pappu vadala pulusu
bengal gram vada pulusu
curry with vada
vada curry
lakshmi vantillu
andhra pulusu curry
ఈ రోజు మనం సెనగ పప్పు వడలతో పులుసు ఎలా పెట్టుకొవాలో చూద్దాం అండి. చాలా సింపుల్ రెసిపీ ఇది . బెండకాయ , వంకాయ పులుసు ఎలా పెట్టుకుంటామో ఇంచు మించు అదే ప్రాసెస్ లో ఈ వడలతో పులుసు పెట్టుకోవచ్చు . పచ్చి శెనగ పప్పు తో వడలు ఎలా తయారు చెయ్యాలో ఇంతక ముందు వీడియో లో చూపించడం జరిగింది … దానికి సంబందించిన లింక్ description box లో ఇస్తున్నాను . ఒకసారి అది కూడా చూడండి
ఇప్పుడు పులుసు కి కావలిసిన పధార్ధాలు ఏంటో చూద్దాం
వడలు – 15
పచ్చి మిర్చి – 5
ఉల్లిపాయ – 3
ఉప్పు – రుచికి సరిపడా
కారం – తగినంత
పసుపు
చింతపండు
కొత్తిమీర
ఆయిల్
తయారీ విధానం :
ముందుగా చింతపండు ని 2 గ్లాసుల వాటర్ లో వేసి నాన బెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయ్యాక పచ్చి మిర్చి , ఉల్లిపాయ వేసి కొంచెం సేపు వేయించి ..,
1 tsp ఉప్పు కలిపి కొంచెం సేపు మగ్గ నివ్వండి. సాల్ట్ కలపడం వల్ల ఆనియన్s కొంచెం తొందరగా మగ్గుతాయి
దీనిలో చిటికెడు పసుపు , తగినంత కారం వేసి బాగా కలపండి
ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని బాగా కలిపి కొంచెం సేపు మూత పెట్టుకోండి
ఆనియన్ లెవెల్ దాక వాటర్ పోసుకుంటే సరిపోతుందండీ
ఈ విధంగా ఆనియన్స్ ఉడికిన తరువాత చింత పండు రసం వేసుకొని ఒకసారి ఉప్పు సరి చూసుకొని కలుపుకొండి
పులుసు చిక్కబడే వరకు మరగనివ్వండి
ఇప్పుడు దీనిలో వడలు వేసి 5 నిమషాలు పాటు మరగ నివ్వండి
వడలు మరీ మెత్తగా అవ్వకుండా చూసుకోండి . చివరిగా కొత్తిమీర కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఒక 20 min అలానే ఉంచిన తరువాత serve చేసుకుంటే వడలకి పులుసు బాగా పట్టి చాలా tasty గా ఉంటుంది
#vadalapulusu #telugu #recipes
Date Published | 2020-05-07 16:37:51Z |
Likes | 1 |
Views | 83 |
Duration | 0:03:26 |