చీజ్ కారం దోస | Butter Cheese Karam Dosa Recipe | Butter Cheese Dosa | Recipes in Telugu | Breakfast
Description :
చీస్ కారం దోస | Butter Cheese Karam Dosa Recipe | Butter Cheese Dosa | Recipes in Telugu | Breakfast
karam dosa
butter dosa
cheese dosa
dosa recipe in telugu
lakshmi vantillu
Hi Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం చీస్ కారం దోస ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పదార్ధాలు
దోస పిండి
ఎండుమిర్చి 8
వెల్లుల్లి రెబ్బలు 8
ఉల్లిపాయ 1
టమాటో 1
ఉప్పు
చీస్
బట్టర్
తయారీ విధానం :
ముందుగా ఎండు మిర్చి ని ఒక బౌల్ వేసుకొని … కొంచెం వాటర్ పోసి … 10 నిమషాల పాటు నాన బెట్ట్టుకోండి
తరువాత మిక్సీ జార్ లో ఉల్లిపాయ ముక్కలు , తోక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు , నాన బెట్టిన ఎండుమిర్చి , తగినంత ఉప్పు , కొద్దిగా వాటర్ పోసుకొని గ్రైండ్ చేసి పేస్టు లా చేసుకోండి . మరీ పలచగా కాకుండా కొంచెం కచ్చ పచ్చ గా ఉండేలా చూసుకోండి
ఇప్పుడు స్టవ్ పై పెనం పెట్టి … హీట్ అయిన తరువాత … బట్టర్ వేసుకోని …ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పిండి తో దోస లా వేసుకోండి
కొంచెం సేపు కాలిన తరువాత రెడీ చేసుకున్న పేస్టు ని దోస మీద వేసి spread చేసుకోండి
దీనిమీద చిన్నగా కట్ చేసిన టమాటో…. మరికొంచెం బట్టర్ కూడా వేసుకోండి
అట్ల కాడతో టమాటో ని కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి
చివరిగా grate చేసుకున్న చీస్ కూడా వేసి …. మెల్ట్ అయ్యే వరకు కాల్చుకోండి
ఈ దోస ని మనం ఒకవైపే కాలుస్తాం కాబట్టి …. స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టి కొంచెం ఎక్కువసేపు కాల్చుకుంటే దోస tasty గా ఉంటుంది… ఒకసారి మీరు ట్రై చేసి నాకు feedback ఇవ్వండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం thank you
#butterdosa #cheesedosa #recipe
Date Published | 2020-06-30 10:20:01Z |
Likes | 2 |
Views | 68 |
Duration | 0:02:35 |