చపాతీ వెజ్ రోల్ | Veg Roll Recipe in Telugu | Chapati Roll | How to Make Veg Roll With Chapati
Description :
చపాతీ వెజ్ రోల్ | Veg Roll Recipe in Telugu | Chapati Roll | How to Make Veg Roll With Chapati
హాయ్ ఫ్రెండ్స్
Welcome to lakshmi vantillu
ఈ రోజు మనం చపాతీ వెజ్ రోల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
గోధుమ పిండి – 2 cups
ఆయిల్
ఉల్లిపాయ
కాప్సికం
క్యాబేజి
పచ్చి మిర్చి
టమాటో
కీర దోసకాయ
నిమ్మకాయ
ఉప్పు
పెప్పర్ పౌడర్
చాట్ మసాలా
టమాటో సాస్
చిల్లీ సాస్
తయారీ విధానం :
ముందుగా గోధుమ పిండి ని ఒక బౌల్ వేసి కొంచెం ఉప్పు వేసుకోండి.
దీనిలో తగినంత వాటర్… కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ముద్దలా చేసుకోండి.
రోల్స్ ని సగం గోధుమ పిండి సగం మైదా పిండి తో కూడా చేసుకోవచ్చు. అలాగే పూర్తిగా మైదా పిండి తో కూడా చేసుకోవచ్చు . మనకి రోడ్ సైడ్ దొరికే రోల్స్ కి పూర్తిగా మైదా పిండి use చేస్తూ ఉంటారు.
ఈ విధంగా రెడీ చేసుకున్న ముద్దకి కొంచెం ఆయిల్ రాసి బాగా ప్రెస్ చేసి ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోండి. ఈ విధంగా ఆయిల్ అప్లై చెయ్యడం వల్ల చపాతీ లు చాల సాఫ్ట్ గా వస్తాయండి
అరగంట తరువాత పిండిని కావలిసిన సైజు లో బాల్స్ లా తీసుకోని… చపాతీ లా చేసుకోండి.
రోల్స్ కోసం కాబట్టి కొంచెం పెద్ద చపాతీ లా చేసుకుంటే బావుంటుంది.
స్టవ్ పై పెనం పెట్టుకొని హీట్ అయిన తరువాత చపాతీ వేసి …. తగినంత ఆయిల్ తో రెండు వైపులా బాగా కాల్చుకొని పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని … చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ , కాప్సికం, క్యాబేజి , పచ్చి మిర్చి వేసి లైట్ గా… పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి
ఫ్రై చేసిన vegitables ని చపాతీ మీద ఈ విధంగా పెట్టుకోండి
దీనిమీద చిన్నగా కట్ చేసిన టమాటో , కీర , తగినంత ఉప్పు , పెప్పర్ పౌడర్ , చాట్ masala , నిమ్మ రసం, , చిల్లీ సాస్, టమాటో సాస్ వేసి… రోల్ చేసుకొని serve చేసుకోండి
మా వీడియోస్ ఫై ,,, మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపం లో తెలియ జేస్తారని ఆశిస్తున్నాను
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం అండి
thank you
#vegroll #chapati #recipe
Date Published | 2020-06-17 14:50:55Z |
Likes | 4 |
Views | 55 |
Duration | 0:04:06 |