అల్లం నిల్వ పచ్చడి రెసిపీ | Garlic Pickle Recipe in Telugu | How to Make Garlic Pickle at Home
Description :
3 నెలలు పాటు నిల్వ ఉండే అల్లం పచ్చడి ఎలా పెట్టుకొవాలో ఈ వీడియో లో చూడండి
andhra pickles recipes
garlic pickle recipe in telugu
home made pickles
how its made? andhra special pickles
garlic storage pickle
indian food recipes in telugu
lakshi vantillu
హాయ్ ఫ్రెండ్స్
Welcome to lakshmi vantillu
ఈ రోజు అల్లం నిల్వ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం అండి. ఇది దోస, పెసరట్టు, ఇడ్లీ, వడ కాంబినేషన్ లో తీసుకోవచ్చు . ఒకో రోజు మనకి టిఫిన్స్ కి కావలసిన చట్నీ చెయ్యడానికి టైం ఉండకపోవచ్చు…. ఆ టైం లో ఇది మనకి చాలా ఉపయోగపడుతుంది . ఒకసారి ఈ పచ్చడి చేసుకొని పెట్టుకుంటే 3 నెలలు నిల్వ పాటు ఉంటుంది. దీన్ని అన్నం లో కూడా కలుపుకొని తినొచ్చు . ఇప్పుడు దీనికి కావలిసిన పధార్ధాలు ఏంటో చూద్దాం
అల్లం – ¼ కిలో
చింత పండు – ¼ కిలో
బెల్లం – 1/4 కిలో
ఆయిల్ – 200 గ్రాములు (రిఫైండ్ / పప్పు / వేరుసెనగ నూనె )
ఎండు మిర్చి – 50 గ్రాములు
ఉప్పు – రుచికి సరిపడా
ఆవాలు
తయారీ విధానం :
అల్లం ని ముక్కలుగా కట్ చేసుకొని , తొక్కను తీసివేసి , మట్టిలేకుండా క్లీన్ గా వాష్ చేసుకొని ఎండలో బాగా అరనివ్వండి.
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ వేసి ఎండిన అల్లం ముక్కలని కొంచెం సేపు వేయించండి. ఒకోసారి ఆయిల్ లో వేసినప్పుడు అల్లం పేలుతూ ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేయించుకోండి
తరువాత ఎండుమిర్చి తొడిమలు తీసి వీటిని కొంచెం సేపు దోరగా వేయించాలి .
ఈ విధంగా వేయించిన అల్లం – ఎండు మిర్చి ని చల్లారే వరకు పక్కన పెట్టుకోండి
ఇప్పుడు చింత పండులో పిక్కలు తీసివేసి ఒకసారి వాష్ చేసుకొండి
దీనిలో సరిపడా వాటర్ కలిపి స్టవ్ మీద మీడియం ఫ్లేమ్ లో ఉడకనివ్వండి
కొంచెం సేపు ఉడికిన తరువాత 4 tsp సాల్ట్ కలుపుకొండి
తరువాత బెల్లం వేసి కరిగే వరకు కలుపుకొని ,,, చింత పండు రసం చిక్కగా దగ్గరగా అయ్యే వరకు ఉడికింఛి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి
ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో వేయించిన అల్లం ముక్కలు వేసి పొడిగా చేసుకోండి
మరొక పెద్ద జార్ తీసుకొని దానిలో ఎండు మిర్చి వేసి కొంచెం సేపు గ్రైండ్ చేసి .., దీనిలో అల్లం పొడి ని కలిపి బాగా మెత్తగా అయ్యే వరకు గ్రైండ్ చేసుకోండి
తరువాత దీనిలో చల్లారిన చింతపండు రసం కలిపి బాగా గ్రైండ్ చేసుకోండి
ఇప్పుడు స్టవ్ కడాయి పెట్టి ఆయిల్ వేసి హీట్ అయిన తరువాత 1 tsp ఆవాలు వేసి ఒకసారి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోండి
దీనిలో గ్రైండ్ చేసిన పచ్చడని వేసి బాగా కలపండి . ఒకసారి ఉప్పు సరిచూసుకొని కావలిసినంత కలుపుకొండి
పచ్చడి లో ఆయిల్ తక్కువ అనిపిస్తే తరువాతైనా కొంచెం ఆయిల్ ని హీట్ చేసి కలుపుకోవచ్చు
మరొక వీడియో లో మళ్ళీ కలుద్దాం అండి… thank you
#garlicpickle #recipe #telugu
Date Published | 2020-05-13 11:01:22Z |
Likes | 1 |
Views | 61 |
Duration | 0:06:33 |