జ్ఞాన యోగము – భగవద్గీత – Chapter 4 – Jñāna Yoga – Bhagavat Gita Telugu Translation

జ్ఞాన యోగము – భగవద్గీత – Chapter 4 – Jñāna Yoga – Bhagavat Gita Telugu Translation

Description :

Gist by Swami Mukundananda @ https://www.holy-bhagavad-gita.org/chapter/4/te

================================================

నాలుగవ అధ్యాయంలో, తను ఉపదేశించే ఈ జ్ఞానంపై, దాని యొక్క సనాతనమైన మూలాన్ని తెలియచేయటం ద్వారా, అర్జునుడి విశ్వాసాన్ని ధృఢపరుస్తున్నాడు, శ్రీ కృష్ణుడు. ఈ సనాతనమైన శాస్త్రాన్ని తాను ప్రారంభంలో సూర్య భగవానుడికి చెప్పానని, ఆ తరువాత పరంపరగా మహాత్ములైన రాజులకు అందించబడింది అని కృష్ణుడు వివరించాడు. ఇప్పుడు అదే మహోన్నతమైన యోగ శాస్త్రమును, తన ప్రియ మిత్రుడు, భక్తుడు అయిన అర్జునుడికి తెలియపరుస్తున్నాడు. ఇప్పుడు కళ్ళెదురుగా ఉన్న శ్రీ కృష్ణుడు, అప్పుడెప్పుడో సూర్య భగవానునికి ఈ శాస్త్రాన్ని ఎలా చెప్పాడని అర్జునుడు అడుగుతాడు. జవాబుగా శ్రీ కృష్ణుడు తన అవతార దివ్య రహస్యాన్ని తెలియపరుస్తాడు. భగవంతుడు సనాతనుడు, పుట్టుకలేని వాడు అయినా, తన యోగమాయా శక్తి చే, ధర్మాన్ని పరిరక్షించటానికి, ఈ భూలోకం లోకి దిగివస్తాడని చెప్తాడు. కానీ, ఆయన జన్మ, కర్మలు దివ్యమైనవి, అవి ఎన్నటికీ భౌతిక దోషములచే కళంకితం కావు. ఈ రహస్యం తెలిసినవారు, ధృడవిశ్వాసంతో భక్తిలో నిమగ్నమవుతారు, మరియు ఆయనను పొందిన తరువాత, ఈ లోకంలో తిరిగి జన్మనెత్తరు.

తదుపరి, ఈ అధ్యాయం, కర్మల స్వభావాన్ని విశదీకరిస్తుంది మరియు – కర్మ, అకర్మ మరియు వికర్మ అనబడే మూడు సూత్రాలను వివరిస్తుంది. కర్మ యోగులు ఏంతో నిమగ్నమయిన పనులలో ఉన్నా ఏవిధంగా అకర్మ స్థితిలో ఉంటారో, తద్వారా ఎలా కర్మ బంధాలలో చిక్కుకోరో ఇది వివరిస్తుంది. ఈ విజ్ఞానంతో ప్రాచీన మునులు – జయాపజయాలతో సంబంధం లేకుండా, సుఖ-దుఃఖాలను ఒకేలాగ పరిగణిస్తూ, కేవలం ఒక యజ్ఞం లాగా భగవంతుని ప్రీతి కోసం తమ పనులను/కర్మలను ఆచరించేవారు. యజ్ఞం అనేది చాలా విధాలుగా ఉంటుంది, అందులో చాలా రకాలు ఇక్కడ చెప్పబడ్డాయి. యజ్ఞం అనేది సరిగ్గా అర్పణచేయబడ్డప్పుడు దాని అవశేషం అమృతంలా అవుతుంది. అలాంటి అమృతం స్వీకరించినప్పుడు, కర్తలు మలిన శుద్ధి చేయబడుతారు. కాబట్టి యజ్ఞం అనేది ఎప్పుడైనా సరియైన దృక్పథం తో, సరియైన జ్ఞానం తో చెయ్యబడాలి. ఈ జ్ఞానమనే నావ సహాయంతో మహా పాపాత్ములు కూడా లౌకిక దుఃఖ సాగరాన్ని దాటవచ్చు. పరమ సత్యాన్ని ఎరిగిన ఒక నిజమైన ఆధ్యాత్మిక గురువు ద్వారా, ఇటువంటి జ్ఞానాన్నినేర్చుకోవాలి. అర్జునుడి గురువుగా, అతన్ని జ్ఞానమనే ఖడ్గం తీసుకుని తన హృదయంలో జనించిన సందేహాలని ముక్కలుగా ఖండించి, లేచి తన కర్తవ్యాన్ని నిర్వర్తించమంటున్నాడు, శ్రీ కృష్ణుడు.

================================================
To strengthen Arjun’s faith in the knowledge He is imparting, Shree Krishna reveals its pristine origin in this chapter. He says, “Arjun, as you are my devotee and a dear friend, I am revealing this supreme science of yog to you. It is the same eternal science that I taught to the Sun God at the beginning of time. And in a continuous tradition, the same knowledge; was passed to the saintly kings.” Arjun wonders how someone who is almost his age could exist so many eons ago. He asks Shree Krishna how is it possible that you gave this knowledge to the Sun God and the others so many years back in time.

Shree Krishna clarifies Arjun’s doubts and discloses the divine mystery of His descension. He says that although God is unborn and eternal, it is to establish dharma (the path of righteousness) that He descends on this earth by His Yogmaya power. His birth and activities are divine and cannot get tainted by material imperfections. Once a devotee knows this secret and engages in devotion with great faith, he attains God and does not take birth in this world again.

Then Shree Krishna goes back to karm yog, the subject from the previous chapter. He continues to explain the nature of work and its three principles: action, in-action, and forbidden action. He elaborates that the karm yogis, even while performing the most engaging task, are in the state of inaction and do not get entangled in the karmic reactions of such action. Knowing this: the ancient sages performed all their work as an act of sacrifice for the pleasure of God. They were not affected by happiness, distress, success, or failure. He explains that when sacrifice is suitably dedicated, performed with proper knowledge and pure sentiments, then its remnants become like nectar. And by partaking such nectar, the devotees are cleansed of all impurities. Even the biggest sinner can cross over the ocean of material miseries by boarding this boat of eternal knowledge.

Shree Krishna says that such knowledge should be acquired only from a genuine spiritual master, who himself is God-realized. Being his Guru, Shree Krishna instructs Arjun to cut apart all doubts that have arisen in his heart with this sword of knowledge. He asks Arjun to now get up and perform his duty as a warrior.


Rated 5.00

Date Published 2022-03-26 15:44:48
Likes 13
Views 1199
Duration 26:12

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..