కర్మ సన్యాస యోగము – భగవద్గీత – Chapter 5 – Karma Sanyasa Yoga – Bhagavat Gita Telugu Translation
Description :
Gist by Swami Mukundananda @ https://www.holy-bhagavad-gita.org/chapter/5/te
ఈ అధ్యాయం ‘కర్మ సన్యాస’ (పనులను త్యజించటం) మార్గాన్ని ‘కర్మ యోగ’ (భక్తి యుక్తంగా పనిచేయటం) మార్గంతో పోల్చి చూపుతుంది. రెండూ కూడా ఒకే లక్ష్యం దిశగా దారితీస్తాయని, మనం వీటిలో దేనినైనా ఎంచుకోవచ్చు అని శ్రీ కృష్ణుడు వివరిస్తున్నాడు. కానీ, మనస్సు ఎంతో పరిశుద్ధమైనదిగా ఉంటే తప్ప కర్మ సన్యాసం అనేది పరిపూర్ణంగా/దోషరహితంగా చేయలేము, మరియు భక్తి తో పనిచేయటం ద్వారానే చిత్త శుద్ధి సాధించవచ్చు. కాబట్టి, కర్మ యోగమే సాధారణంగా చాలామందికి సరియైన దారి. కర్మ యోగులు తమ ప్రాపంచిక విధులను పవిత్రమైన బుద్దితో, ఫలాసక్తి విడిచి, భగవత్ అర్పితముగా చేస్తారు. ఈ విధముగా, తామరాకుకు నీటి తడి అంటనట్టు, వారికి పాపము అంటదు. జ్ఞాన ప్రకాశంచే వారు ఈ శరీరము అనేది, ఆత్మ వసించే నవ ద్వారాల నగరమని తెలుసుకుంటారు. ఈ విధంగా, వారు తాము కర్తలము కాము అని, తాము భోక్తలము కూడా కాము అని తెలుసుకుంటారు. వారు అందరి పట్ల సమత్వ దృష్టి కలిగి ఉంటారు; ఒక బ్రాహ్మణుడు, ఆవు, ఏనుగు, కుక్క, చండాలుడు అందరినీ సమానంగా చూస్తారు. అటువంటి నిజమైన జ్ఞానులైన జనులు దోషరహిత మైన దైవీ గుణాలు పెంపొందించుకొంటారు మరియు పరమ సత్యము యందు స్థితులై ఉంటారు. ప్రాపంచిక జనులు, ఇంద్రియ వస్తువిషయముల నుండి వచ్చే సుఖాల కోసం ఏంతో శ్రమిస్తారు, కానీ, అవే నిజముగా దుఃఖ హేతువులు అని తెలుసుకోరు. కానీ, కర్మ యోగులు వాటి యందు ఆసక్తి కలిగి ఉండరు; ప్రతిగా, తమలోనే ఉన్న భగవంతుని ఆనందాన్ని ఆస్వాదిస్తారు.
ఈ అధ్యాయం, తదుపరి, కర్మ సన్యాస మార్గాన్ని వివరిస్తుంది. కర్మ సన్యాసులు ఇంద్రియమనోబుద్ధుల నియంత్రణకు ఎన్నో నిష్ఠలు పాటిస్తారు. వారు బాహ్యమైన భోగ సంబంధ అన్ని తలంపులని త్యజించి, కామ, క్రోధ, భయముల నుండి స్వేచ్చ పొందుతారు. ఈ నియమనిష్ఠలన్నిటినీ భగవత్ భక్తితో సంపూర్ణము చేసి, శాశ్వతమైన శాంతిని పొందుతారు.
=======================================================
Gist by Swami Mukundananda @ https://www.holy-bhagavad-gita.org/chapter/5
In this chapter, Shree Krishna compares karm sanyās yog (the path of renunciation of actions) with karm yog (the path of work in devotion). He says: we can choose either of the two paths, as both lead to the same destination. However, he explains that the renunciation of actions is rather challenging and can only be performed flawlessly by those whose minds are adequately pure. Purification of the mind can be achieved only by working in devotion. Therefore, karm yog is a more appropriate path for the majority of humankind.
The karm yogis with a purified intellect perform their worldly duties without any attachment to its fruit. They dedicate all their works and its results to God. Just as a lotus leaf that floats on water does not get wet, the karm yogis also remain unaffected by sin. They are aware that the soul resides within the body that is like a city with nine gates. Therefore, they do not consider themselves to be the doer nor the enjoyer of their actions. Endowed with the vision of equality, they look equally upon a Brahmin, a cow, an elephant, a dog, and a dog-eater. Seated in the Absolute Truth, such truly learned people develop flawless qualities similar to God. The ignorant worldly people do not realize that the pleasures they strive to relish from their sense objects are the very source of their misery. However, the karm yogis do not get any joy from such worldly pleasures. Instead, they enjoy the bliss of God, who resides inside them.
Lord Shree Krishna then describes karm sanyās yog or the path of renunciation. He says that the karm sanyāsīs control their mind, intellect, and senses by performing several austerities. By shutting out all their thoughts of external pleasures, they become free from fear, desire, and anger. And by including devotion to God in all their austerities, they attain long-lasting peace.
================================================
Date Published | 2022-02-26 12:27:45 |
Likes | 7 |
Views | 284 |
Duration | 17:18 |