సాంఖ్య యోగము 1/2 – భగవద్గీత – Chapter 2 – Part 1/2 – Sānkhya Yoga – Bhagavat Gita Telugu Translation

సాంఖ్య యోగము 1/2 – భగవద్గీత – Chapter 2 – Part 1/2 – Sānkhya Yoga – Bhagavat Gita Telugu Translation

Description :

Gist by Swami Mukundananda @ https://www.holy-bhagavad-gita.org/chapter/2/te

================================================
ఈ అధ్యాయములో అర్జునుడు, పరిస్థితిని తట్టుకోవడంలో ఉన్న తన పూర్తి అశక్తతని పునరుద్ఘాటించి, ఆసన్నమైన యుద్దంలో తన విధిని నిర్వర్తించడానికి నిరాకరించాడు. ఆ తరువాత శ్రీ కృష్ణుడిని తన ఆధ్యాత్మిక గురువు గా ఉండమని పద్ధతి ప్రకారముగా, మర్యాదపూర్వకంగా ప్రాధేయపడి, తను ఉన్న ఈ పరిస్థితిలో ఏమి చెయ్యాలో తనకు దిశానిర్దేశము చేయమని శ్రీ కృష్ణుడిని బ్రతిమాలతాడు. శరీరము నశించినా, నశించిపోని, మరణము లేని ఆత్మ గురించి చెప్పటం ద్వారా దివ్య జ్ఞానాన్ని విశదీకరించటం ప్రారంభిస్తాడు, ఆ పరమాత్మ. ఒక మనిషి పాత బట్టలు తీసివేసి కొత్త బట్టలు ఎలాగైతే వేసుకుంటాడో ఆత్మ అనేది కేవలం ఒక జీవిత కాలం నుండి ఇంకో జీవిత కాలానికి శరీరాలను మార్చుకుంటుంది. ఆ తరువాత శ్రీ కృష్ణుడు సామాజిక భాధ్యతల గురించి ప్రస్తావిస్తాడు. ధర్మాన్ని పరిరక్షించడానికి యుద్ధం చేయవలసిన తన క్షత్రియ భాద్యతలను అర్జునుడికి గుర్తుచేస్తాడు. సామాజిక భాధ్యతని నిర్వర్తించటం ఒక పవిత్రమైన ధర్మమని, అది ఉత్తమ గతుల వైపు దారి చూపుతుందని, అదేసమయంలో, కర్తవ్య ఉల్లంఘన వలన అవమానము, తలవంపు, అపకీర్తి కలుగుతాయని చెప్తాడు.

అర్జునుడిని లౌకిక స్థాయి నుండి పైకి తీసిన శ్రీ కృష్ణుడు, తదుపరి, కర్మ శాస్త్రాన్ని లోతుగా విశదీకరిస్తాడు. కర్మ ఫలాలపై అనురక్తి పెంచుకోకుండా కర్మలను ఆచరించమని అర్జునుడికి సూచిస్తాడు. ప్రతిఫలాన్ని ఆశించకుండా కర్మలని ఆచరించడాన్ని ‘బుద్ధి యోగము’ అన్నాడు. బుద్దిని ఉపయోగించి మనము కర్మ ప్రతిఫల కాంక్షని నిగ్రహించాలి. ఇలాంటి దృక్పథంతో పని చేస్తే, బంధాన్ని కలిగించే కర్మలే, బంధ-నాశక కర్మలుగా మారిపోయి, అర్జునుడు దుఃఖ రహిత స్థితిని చేరుకుంటాడు.

దివ్య జ్ఞానం లో ఉన్న వారి లక్షణాల గురించి అర్జునుడు అడుగుతాడు. దానికి జవాబుగా, శ్రీ కృష్ణుడు, ఆధ్యాత్మిక జ్ఞానం లో ఉన్న వారు మోహము, భయం, కోపములకు అతీతంగా ఎలా ఉంటారో విశదీకరించాడు. వారు సుఖః-దుఃఖాలను సమానంగా స్వీకరిస్తూ, అన్ని పరిస్థితులలో ప్రశాంతంగా ఉంటారు; వారి ఇంద్రియములు నిగ్రహించబడి ఉంటాయి; వారి మనస్సు ఎప్పుడూ భగవంతునిలో లీనమై ఉంటుంది; మానసిక క్లేశములైన – కామము, క్రోధము, లోభములు – ఎలా ఎదుగుతాయో, వాటిని ఎలా నిర్మూలించవచ్చో, దశల వారీగా శ్రీ కృష్ణుడు విశదీకరిస్తాడు.

================================================
Gist by Swami Mukundananda @ https://www.holy-bhagavad-gita.org/chapter/2

In this chapter, Arjun reiterates to Shree Krishna that he is unable to cope with his current situation, where he has to kill his elders and teachers. He refuses to take part in such a battle and requests Shree Krishna to be his spiritual teacher and guide him on the proper path of action. Then the Supreme Lord starts imparting divine knowledge to Arjun. He begins with the immortal-nature of the soul, which is eternal and imperishable. Death only destroys the physical body, but the soul continues its journey. Just as a person discards his old clothes and adorns new ones, the soul keeps changing bodies from one lifetime to another.

The Lord then reminds Arjun that his social responsibility as a warrior is to fight for upholding righteousness. He explains that performing one’s social duty is a virtuous act that can take him to the celestial abodes, while dereliction only leads to infamy and humiliation.

At first, Shree Krishna tries to motivate Arjun at a mundane level. Then he moves deeper and starts explaining to Arjun the Science of Work. He asks Arjun to perform his deeds without any attachment to their fruits. This science of working without desire for rewards is called the yog of the intellect or buddhi-yog. He further advises that the intellect should be used to control the desire for rewards from work. By working with such intent, the bondage-creating karmas get transformed into bondage-breaking karmas and a state beyond sorrows can be attained.

Arjun is curious to know more about those who are situated in divine consciousness. Shree Krishna, therefore, describes how persons who have attained transcendence are free from attachment, fear, and anger. They are undisturbed and equipoised in every situation. With their senses subdued, they keep their minds always absorbed in God. He also explains the progression of afflictions of the mind—such as greed, anger, lust, etc. and advises how these can be overcome.


Rated 5.00

Date Published 2022-06-06 10:56:45
Likes 9
Views 254
Duration 22:38

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Don't Miss! random posts ..