ఆలూ బఠానీ చాట్ | Aloo Batani Chat Recipe in Telugu | Tasty Street Food| Recipes | Chat Recipe
Description :
ఆలూ బఠానీ చాట్ | Aloo Batani Chat Recipe in Telugu | Tasty Street Food| Recipes | Chat Recipe
allo chat recipe
batani chat recipe
easy snack recipes in telugu
indian food recipes in telugu
Hi Friends…
Welcome to lakshmi vantillu
ఈ రోజు aloo batani chaat ఎలా చేసుకోవాలో చూద్దాం
దీనికి కావలిసిన పధార్ధాలు
వైట్ బఠాని 1 cup
బంగాళా దుంపలు 2
ఉల్లిపాయ 1
టమాటో 1
నిమ్మకాయ
ఉప్పు
కారం 1 ½ tsp
చాట్ మసాలా 1 tsp
గరం మసాలా ½ tsp
అల్లం వెల్లుల్లి పేస్టు 1 tsp
నెయ్యి 2 tsp
పసుపు
కొత్తిమీర
తయారీ విధానం :
ముందుగా బఠాని ని ఒక బౌల్ లో వేసి తగినంత వాటర్ పోసుకొని… 5 గంటల పాటు నాన బెట్ట్టుకోండి
నాన బెట్టిన బఠాని ని బాగా వాష్ చేసి… తగినంత వాటర్ , కొద్దిగా ఉప్పు వేసి … కుక్కర్ లో మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి
ఈ విధంగా ఉడికిన తరువాత… సగం బఠానీ లను …. మిక్సీ లో వేసి… కొద్దిగా వాటర్ కూడా పోసుకొని… గ్రైండ్ చేసి పేస్టు లా చేసుకోండి . మరీ పలచగా కాకుండా ముద్దలా ఉండేలా చూసుకోండి
అలాగే బంగాళా దుంపల ని కూడా … తగినంత వాటర్ పోసుకొని … కుక్కర్ లో రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించి … చల్లారిన తరువాత మాష్ చేసి పక్కన పెట్టుకోండి
ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి … నెయ్యి వేసుకొని … చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ , అల్లం వెల్లుల్లి పేస్టు వేసి దోరగా వేయించుకోండి
మీకు కావాలనుకుంటే నెయ్యి బదులు ఆయిల్ కూడా వాడుకోవచ్చు …, కానీ నెయ్యితో చేసుకుంటే చాలా tasty గా ఉంటుంది
చిన్నగా కట్ చేసుకున్న టమాటో కూడా వేసి మరి కొంచెం సేపు వేయించండి
ఇప్పుడు దీనిలో ఉడికించిన బఠానీలు ….. గ్రైండ్ చేసి పెట్టుకున్న బఠాని పేస్టు ….. మాష్ చేసి పెట్టుకున్న బంగాళా దుంపలు ….. కొద్దిగా పసుపు , తగినంత ఉప్పు ….. కారం , చాట్ మసాలా , గరం మసాలా వేసి బాగా కలిపి …. తగినంత వాటర్ కూడా పోసి 10 నిమషాల పాటు మూత పెట్టి ఉడికించుకోండి
కడాయి కి అంటుకోకుండా… మధ్య మధ్యలో బఠానీ ని కలుపుతూ ఉండండి
చివరిగా కొత్తిమీర వేసి కలుపుకొని … మరొక నిమషం పాటు మూత పెట్టి … స్టవ్ ఆఫ్ చేసుకోండి
ఆలూ బఠాని చాట్ రెడీ అయిపోయిందండి … ఇప్పుడు దీన్నొక బౌల్ లోకి తీసుకొని చిన్నగా కట్ చేసిన ఆనియన్, టమాటో , కొత్తిమీర వేసి… నిమ్మరసం పిండుకొని serve చేసుకోండి .
ఈ చాట్ ని మనం వేడి వేడిగా తింటే …. చాలా tasty గా ఉంటుంది
మరింకెందుకు ఆలస్యం …. మీరు ట్రై చేసి చూడండి
మరొక రెసిపీ తో మళ్ళీ కలుద్దాం
thank you
#aloobatani #chat #recipe
Date Published | 2020-06-26 13:21:31 |
Likes | 4 |
Views | 62 |
Duration | 5:13 |
Good video lakshmi garu.pillalaki chesi pettachu.